అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం
ఘనంగా అయోధ్య రాముడు విగ్రహ ప్రతిష్ట వేడుకలు
శ్రీరాముని చిత్రపటాన్ని
ఊరేగించిన చిన్నంపల్లి గ్రామస్తులు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల పరిధిలోని చిన్నంపల్లి లక్ష్మంపల్లి గ్రామంలో ఘనంగా
అయోధ్య లో శ్రీరాముని నూతన దేవాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ను పురస్కరించుకొని సోమవారం సెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామంలో శ్రీరాముని చిత్రపటాన్ని ట్రాక్టర్ నందు గ్రామ పుర వీధుల్లో చిన్నపిల్లలు, మహిళలు, కలశాలతో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది.
లక్ష్మంపల్లి గ్రామంలో
గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరాముని దేవాలయం అనేక సమస్యల్లో ఉండగా ఇప్పటితో సమస్యను పరిష్కరించుకొని అయోధ్యలో నూతన దేవాలయాన్ని నిర్మించుకోవడాన్ని సంతోషిస్తూ ఈరోజు గ్రామంలో ఒక పండుగలా జరుపుకున్నారు.
కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, రామసేవకులు వన్నూర స్వామి, బర్రి స్వామి రెడ్డి, తిప్పేస్వామి, అనిల్, చెప్పమయ్యా, వన్నూరప్ప, విరుపాక్షి, మారుతి, తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం:శ్రీరాముని చిత్రపటాన్ని
ఊరేగించిన చిన్నంపల్లి గ్రామస్తులు
RELATED ARTICLES