

తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
ఒంటిమిట్ట న్యూస్
యాంకర్ వాయిస్
కడప జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట కట్టపై వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించడం జరిగింది ముక్కోటి ఏకాదశి సందర్భంగా చెరువు కట్టపై వెలసిన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు భారీగా అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు తిలకించుటకు మిట్టపల్లి భజన బృందం వారి కనులు విందుగా అంగరంగ వైభవంగా చెక్కభజన కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు దాతల సహాయంతో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు భక్తులు పాల్గొన్నారు… ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు దాతలుకు ధన్యవాదాలు తెలియజేశారు