ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్టకు అయోధ్య రామ మందిరం నుండి అక్షింతలు బుధవారం చేరాయి. ఆర్ఎస్ఎస్ నేత వేణుగోపాల్ రాజు ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఒంటిమిట్ట మండల పరిధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఉంచారు. వారు మాట్లాడుతూ అక్షింతలకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము శ్రీరామ జయజయ రామ అంటూ 11సార్లు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు, సి. గె భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాజంపేట నియోజకవర్గం ఇన్చార్జి మనోహర్ బాబు, పత్తి సుబ్బరాయుడు, గజ్జల శీను, లక్ష్మి రెడ్డి, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్టకు చేరిన అయోధ్య అక్షింతలు
RELATED ARTICLES