కామారెడ్డి జిల్లా బీబీపేట్
దళిత బంధు నిధులు విడుదల చేయాలని హైదరాబాద్ లోని ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ కరుణాకర్ ను శనివారం కామారెడ్డి జిల్లా దళిత బంధు లబ్ధిదారులు కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్ కరుణాకర్ సానుకూలంగా స్పందించి, అంతే కాకుండా ప్రతి జిల్లా నుండి దళిత బంధు లబ్దిదారులు గా ఎంపీక అయిన వారి లిస్ట్ ప్రభుత్వం అడిగిందని, కాబట్టి దాని పరిశీలన జరుగుతుందని, త్వరలోనే దీని పై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎస్సి కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ ను కలిసిన వారిలో రవీందర్, స్వామి , నర్సింలు ఏళ్లము, నర్సింలు, ధనరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సి కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ ను కలసిన దళిత బంధు లబ్ధిదారులు
RELATED ARTICLES