Monday, January 20, 2025

ఎర్రగుంటలో నిర్మించిన మిషనరీ బాప్టిస్ట్ చర్చి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
29-10-2024
పాల్వంచ మండలం


పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంటలో నూతనంగా నిర్మించిన మిషనరీ బాప్టిస్ట్ చర్చ్ ను మంగళవారం ప్రారంభించారు. ఎర్రగుంట గ్రామస్తులు, అమెరికా సంస్థల సహకారంతో నిర్మించిన చర్చ్ ప్రారంభ వేడుకల్లో *DCMS చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు* పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకన్నా మానవత్వం మిన్న అన్నారు. ప్రతి ఒక్కరూ సాటి మనిషికి సహాయపడాలని *కొత్వాల* అన్నారు.

*చర్చ్ ఫాదర్ జి. క్రిష్టఫర్* అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో *అమెరికా సంస్థ ఎయింట్స్ గాడ్ గుడ్ మినిస్ట్రీస్ సంస్థకు చెందిన పాస్ డాని టెన్సనీర్* ప్రముఖ ఉపన్యాసకులుగా వ్యవహరించారు.

*కొత్వాల ను సన్మానించిన నిర్వాహకులు*

ఈ సందర్బంగా నూతన చర్చ్ నిర్వాహకులు *కొత్వాల* ను శాలువా బొకే లతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో *గ్రామస్తులు ఎన్, నరసింహారావు, ఎస్. కమలాకర్, బి. శ్యాం, ఎస్, ఎర్రయ్య, డి. మాణిక్యరావు, కె. సీతారాములు, కాంగ్రెస్ నాయకులు సాధం రామ కృష్ణ, వై. వెంకటేశ్వర్లు, చింతా నాగరాజు, మాలోత్ కోఠి నాయక్, వాసుమల్ల సుందర్ రావు, రాములు నాయక్, చాంద్ పాషా* తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular