హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజక వర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేతుల మీదుగా 2024
నూతన సంవత్సర తేజ న్యూస్ టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే న్యూస్ సంఘటనలు సమాజంలో ఉపయోగపడే వార్తలు రాస్తూ ఎంతో విలువలతో కూడుకున్న వాస్తవాలు రాస్తూ ప్రతినిత్యం
పబ్లిక్ సమస్యలపై న్యూస్ కవరేజ్ చేస్తున్న తేజ న్యూస్ టీవీ యాజమాన్యానికి రిపోర్టర్లఅందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అధికారులు కు ప్రజా ప్రతినిధులు ప్రతినిత్యం కొత్త విషయాలను తెలియజేస్తూ సమాజానికి ఎంతో ఉపయోగపడే మనకు తెలియని విషయాలను తెలియపరుస్తూ ప్రతినిత్యం ప్రజలతో ప్రజా సమస్యలు న్యూస్ కవర్ చేస్తూ మన తెలంగాణ పాత్రికేయ మిత్రులు ఎంతగానో కష్టపడుతూ పనిచేస్తున్నారన్నరు . ఈ సందర్భంగా ఛానల్ యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హఫీజ్పేట్ డివిజన్ అధ్యక్షులు బాలిన్ గౌతమ్ గౌడ్ శేరిలింగంపల్లి జర్నలిస్ట్ రామచందర్ రిపోర్టర్ కొండ శ్రీనివాస్ రిపోర్టర్ శేర్లింగంపల్లి కర్ర బాబు తదితరులు పాల్గొన్నారు.