ఎన్టీఆర్ జిల్లా వీరులపాడుమండలం
వీరులపాడు,జుజ్జూరు గ్రామ శివారులో స్కూటీని ఆటో ఢీకొన్న ఘటనలో యువతీకి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన సమాచారం మేరకు జుజ్జూరు గ్రామానికి చెందిన పానకాల కోటేశ్వరి తన స్కూటీపై అల్లూరు వైపు వెళుతుండగా, అల్లూరి వైపు నుండి జుజ్జూరు గ్రామం వైపు వస్తున్న ఆటో ఢీకొట్టడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించి ఆటో నడుపుతున్నట్లుగా తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వీరులపాడు ఎస్సై జి. అనిల్ తెలిపారు
ఎన్టీఆర్ జిల్లా: స్కూటీని ఆటో ఢీకొన్న ఝటనలో యువతకి తీవ్ర గాయాలు
RELATED ARTICLES