ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం
భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఈరోజున కార్మిక సంయుక్త కమిషనర్ ఆంధ్రప్రదేశ్ గారికి వినతిపత్రం అందించిన ఎన్టీఆర్ జిల్లా బిల్లింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్(BCWU)
గౌరవనీయులైన కార్మిక సంయుక్త కమిషనర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్(BCWU) రి.నెంబర్K-379 చేసుకొని విన్నపము
రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి గడిచిననాలుగున్నర సంవత్సరాలుగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ప్రమాదాల బారిన పడ్డ భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారాలు రాకుండా 12 14 సర్క్యులర్ ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్మికుడికి నష్టపరిహారం రాకోకుండా చేస్తుంది
సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు అందవలసిన నష్టపరిహారాలు అందకపోవటంతో ప్రమాదాలు బారిన పడ్డ కార్మికులు వారిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితుల్లో ఈరోజు భవన నిర్మాణరంగం ఉంది
సంక్షేమ బోర్డు సమస్యలను పరిష్కరించమని గతంలో అనేకసార్లు కార్మిక శాఖ కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారికి కార్మిక శాఖ మంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చిన ఇంతవరకు ఎవరు కూడా సంక్షేమ బోర్డు అమలు చేసే దానికోసం చర్యలు చేపట్టలేదు
ఇప్పటికైనా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి సంక్షేమ బోర్డుని యధావిధిగా అమలు చేయాలని కోరుతూ ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక సంయుక్త కమిషనర్ ఆంధ్రప్రదేశ్ గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది.
కార్మిక సంయుక్త కమిషనర్ గారు స్పందిస్తూ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో చేరవలసిన కార్మికులు చేరవచ్చని బోర్డులో చేరి ఉన్న కార్మికులుకార్డు రెన్యువల్ చేయించుకోవాలి అట్లాగే ప్రమాదాలు బారిన పడ్డ కార్మికులు నష్టపరిహారాల కోసం సంక్షేమ బోర్డుకి అప్లై చేసుకోవచ్చు సంక్షేమ బోర్డు పనిచేసేటప్పుడు ప్రమాదాలు గురైన కార్మికులు ఎవరైతే నష్టపరిహారాల కోసం భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులసంక్షేమ బోర్డుకి అప్లై చేసుకోని ఉంటారొ వారందరికీ నష్టపరిహారాలు వస్తాయని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిల్లింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు జి హరికృష్ణ రెడ్డి కొప్పుల కుమారు ఎన్టీఆర్ జిల్లా బిల్లింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి షేక్ మీరావాలి ఆదిమల్ల పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు
ఎన్టీఆర్ జిల్లా: భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి
RELATED ARTICLES