Thursday, January 16, 2025

ఎన్టీఆర్ జిల్లా :ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోడి కత్తి శీను తల్లి సావిత్రమ్మ ను పరామర్శించిన తంబళ్లపల్లి రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా
నందిగామ నియోజకవర్గం

నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త *శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి* ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న *జనిపల్లి శ్రీనివాసరావు* అలియాస్ *కోడి కత్తి శీను* తల్లి సావిత్రమ్మ మరియు సోదరుడు సుబ్బరాజు ని విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్లో కలిసి పరామర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ ఐదున్నర సంవత్సరం నుండి జనిపల్లి శ్రీనివాసరావు జైల్లో మగ్గుతున్నాడు, బాధితుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవిలో కూర్చుని రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు. అసలు ఒక దళితుడిని జైల్లో పెట్టించి అతనిపై కేసులు పెట్టించి ఆ కేసులు కోర్టుకు రాకుండా మేనేజ్ చేస్తోంది, ఎవరన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దళితులపై దాడులు చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దళితులు అంటే ఆయనకి అంత చిన్న చూపు ఎందుకు. దళితులను మర్డర్ చేసి ఇంటికి పార్సల్ చేసిన వాళ్ళని పక్కన పెట్టుకోవడం కోడి కత్తితో పొడిచాడు అని చెప్పి నిందలు వేసి అతన్ని జైల్లో శిక్ష అనుభవించేలా చేయడం, దళితులను ఎదురు తిరిగితే హతమార్చడం, ఇలాంటి చర్యలు చేస్తూ ఓపక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆయన అంబేద్కర్ తో పోలుస్తూ భజనలు చేస్తున్న ఈ ఎమ్మెల్యేలు మంత్రులను జనసేన పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాము. ఒక్కసారి సాటి దళితుడికి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం న్యాయం చేశాడని ప్రశ్నించే దమ్ము, ధైర్యం మీకుందా అని మీడియా ముఖంగా ప్రశ్నించారు తంబళ్లపల్లి రమాదేవి. ఈరోజు శ్రీనివాసరావు తల్లిని చూస్తే, ఆమె ఆవేదన వింటే, ఆ తల్లి యొక్క బాధ ఎంత వర్ణనాతీతంగా ఉందో తెలుసా. ఆమె బిడ్డని ఏం చేస్తారో అన్న భయాందోళనతో ఈ వయసులో ఆమె రోడ్డు పైకి వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆ తల్లి కోసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆమెకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసైనికులు, పవన్ ఆర్మీ టీం పాల్గొనడం జరిగింది….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular