TEJA NEWS TV
ములుగు జిల్లా
ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ బి రేణుక ప్రారంభించగా, చరిత్ర విభాగాధిపతి సిహెచ్ వెంకటయ్య ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ప్రపంచ మానవాళికి స్వామి వివేకానంద ఆదర్శప్రాయుడనీ ఆయన భావాలు
శిరోదార్యమని , నేటి యువత ఆయన చూపించిన మార్గంలో ప్రయాణిస్తే, దేశంతో పాటు ప్రపంచమంతా శాంతిని సాధించగలరని అన్నారు. స్వామి వివేకానందుని జయంతిని జాతీయ యువజన దినోత్సవం గా జరుపుకోవడం చాలా ఆనందకరమని పేర్కొన్నారు. వచ్చిన విద్యార్థులకు వివేకనందుని ప్రసంగాలు, ఆయన చరిత్ర వివరించారు.
యువత శాంతి మార్గంలో నడిస్తే ప్రతి రంగంలోనూ ఎనలేని కీర్తిని ఘటించవచ్చు అని తద్వారా విజయాలను సొంతం చేసుకోవచ్చని వివేకనందుడి గొప్పతనాన్ని విద్యార్థులకు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ డి.నవీన్, ఐక్యూఎస్ కోఆర్డినేటర్ dr. పి.జ్యోతి, ఫాతిమా, సంపత్, రమేష్, జీవవేని, శేఖర్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఎటుర్ నాగారం: ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
RELATED ARTICLES