TEJA NEWS TV
ములుగు జిల్లా ఎటునాగారం మండల కేంద్రంలో ఎస్ఐగా పనిచేస్తూ ఇటీవల కాలంలో పెళ్లి పీటలు ఎక్కిన ఎస్సై తాజుద్దీన్ వివాహ వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. అనంతరం కొత్త వధూవరులనుఆశీర్వదించారు. ఈ మేరకు ఇదే రోజు ములుగు పట్టణ కేంద్రానికి చెందిన మంత్రివర్యులు సీతక్క డ్రైవర్ ఆకుల భరత్ కూతురి మొదటి పుట్టినరోజు వేడుకలకు సైతం హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి మనవడు మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్ కుమార్ కుమారుడు వేదాంత్ పుట్టిన రోజు వేడుకలకు సైతం హాజరై ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచందర్, రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎటునాగారం ఎస్సై వివాహనికి హాజరైన మంత్రి సీతక్క
RELATED ARTICLES