యన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామం
ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి
కంచికచర్ల మండలం : చెవిటికల్లు,గని ఆత్కూరు గ్రామంలో సోమవారం నాడు మీచాంగ్ తుఫాను వలన పూర్తిగా పాడైపోయిన వరి, మిర్చి పంట పొలాలను జనసేన తెదేపా రైతు నేతలు, శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు , ఎన్టీఆర్ జిల్లా తెదేపా రైతు అధ్యక్షులు చెరుకూరు రాజేశ్వరరావు గారు, నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు గారు, నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి గారితో కలిసి సందర్శించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య*_
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలతో జగన్ రెడ్డి దిమ్మెరపోయాడు. ఇంకా రాష్ట్ర రైతాంగాన్ని ఏమీ ఆదుకుంటాడు
జగన్ రెడ్డి వై నాట్ లిక్కర్ వై నాట్ సాండ్ వై నాట్ మైన్ అంటూ దోచుకుని దాచుకుంటున్నాడు
స్థానిక ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ బజ్జీల బండ్లు,అరటికాయ బండ్ల వద్ద కమిషన్ల కలెక్షన్లో బిజీగా ఉన్నారు.
కమీషన్లు తీసుకోవడానికి వెచ్చించే సమయంలో కొంత సమయమైనా రైతన్నల కోసం కేటాయించడానికి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సమయం లేదు.
వేలాది ఎకరాలలో రైతు పంట నష్టపోయాడు
గని ఆత్కూరు గ్రామంలో వందలాది ఎకరాలు నేలవాలయి
కంచికచర్ల మండలంలో 2,160 ఎకరాలు వరి పూర్తిగా చేతికి రాని పరిస్థితి.
7500 ఎకరాల్లో పత్తి పూర్తిగా దెబ్బతిన్నది.మిర్చి పొలాలకు పెట్టిన పెట్టుబడులు మొత్తం నేలపాలు అయిపోయాయి
5 ఎకరాలు కౌలు తీసుకున్న రైతు 8 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి మిర్చి సాగు చేస్తే రూపాయి వచ్చే పరిస్థితి లేదు.రైతుకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు రైతు విలవిలాడిపోతున్నాడు
మిచాంగ్ తుఫాను రైతన్న జీవితాలలో చీకటిని నింపింది. రైతన్న కంట కన్నీరే మిగిలింది
ఒక్క వరి గింజ అయినా రైతన్న చేతికి వస్తుందన్న నమ్మకం లేదు
పాలకులు,అధికారులు పొలాల్లోకి రావాలి తక్షణమే పంట నష్ట పరిహారాలను అంచనాలను వేసి ప్రభుత్వానికి అందజేసి రోజులలోనే రైతుకు పంట నష్టపరిహారాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం….
ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి -తంగిరాల సౌమ్య
RELATED ARTICLES