TEJA NEWS TV
అన్ని రంగాల్లో వెనుకబడ్డ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని దృఢ సంకల్పంతో “”ఉమ్మడి కర్నూలు జిల్లా ఏపీ న్యాయవాదుల జేఏసీ నూతన ఏర్పాటు కమిటీ””సభను
కర్నూల్లోని బళ్లారి చౌరస్తాలో సూరజ్ గ్రాండ్ హోటల్ నందు ఏపీ వాల్మీకి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.
ఈ సభకు అనంతపురం నంద్యాల కర్నూల్ ఇతర జిల్లాల నుండి న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, మధుసూదన్,అనంతపురం ఎంపీ అంబికా కృష్ణ లను న్యాయవాదులు శాలువలు పూలమాలతో సత్కరించారు.
ఈ సభను ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ సమాజంలో విద్య ఉపాధి రంగాల్లో వెనుకబడ్డ వాల్మీకులను పాలక ప్రభుత్వాలు ఎస్టీలుగా గుర్తించాలని అందుకోసం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కృషి చేయాలని ఈరోజు ఇక్కడ ఏర్పాటైన నూతన న్యాయవాదుల ఏపీ కర్నూల్ జేఏసీకి అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భాస్కర్ నాయుడు,డాక్టర్ భవాని, శివరామకృష్ణ, ప్రసాద్,రంగస్వామి,వీరేష్,ఆనంద్ ఆర్మీ రామయ్య, ఉడుములపాడు నాగేంద్ర,పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఏపీ వాల్మీకి న్యాయవాదుల నూతన కమిటీ జేఏసీ సంఘం ఎన్నిక
RELATED ARTICLES