ఆసక్తికరం రేపుతున్న 2024 డోన్ ఎన్నికలు
రెండూన్నర ఏళ్లుగా గుర్తు రాని డోన్ గడ్డ ఇప్పుడూ గుర్తు వచ్చిందా అంటూ కె.యి కోట్ల కుటుంబాలకు చమత్కారలు విసూరుతూ 2024 ఎన్నికలలో ప్రజా నిర్ణయంలో డోన్ గడ్డి గడ్డ ఎవరిదో తేల్చుకుందాం అంటూ సవాల్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 2024 ఎన్నికలలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి నీ నియమిస్తున్నట్లు ప్రకటించి తీరా ఎన్నికలు దగ్గరగా సమీపిస్తున్న వేళ డోన్ నియోజక వర్గంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నీ ఓడించలంటే గట్టి ప్రత్యర్థి కావాలని ఆ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అని తెలుపుతూ డోన్ నియోజక వర్గ అభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని ప్రకటించారు. ఈ ప్రకటనతో ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఏ పార్టీ వైపు వెళ్తారో అని గత పది రోజులుగా నియోజకవర్గంలో ఉత్కంఠకు దారితీసింది.ఈ ఉత్కంఠకు తెర దించుతూ శనివారము ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి తన అనుచరులు అభిమానులూ తన వెంట ఉండే నాయకులతో తన స్వగృహం నుండి భారీ ర్యాలీ గా పాత బస్టాండ్ లో సభా నిర్వహిస్తూ పట్టణము గుండా ర్యాలీగా వెళుతూ పార్టీ కార్యలయం నందు భహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు వేల సంఖ్యలో ఆభిమానులూ తరలి రావడంతో ఒక్కసారిగా సభా దద్దరిల్లింది. ఆ సభకు హాజరైన అభిమానులను ఉద్దేశించి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ రెండూన్నర సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అండగా ఉండాలని చెబుతూ పార్టీ పగ్గాలు తీసుకోవాలని గతంలో డోన్ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నాయకులను అడుగగా మాకు ఇక్కడ పోటీ చేసే ఉద్దేశం లేదంటూ తప్పుకున్నారని అధినేత నియోజకవర్గ నాయకుల కోరిక మేరకు పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు చేపట్టి గత రెండు సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గం లోని డోన్ బేతంచెర్ల ప్యాపిలి మండలాల నాయకులకు కార్యకర్తలకు అండగా నిలుస్తూ గత రెండున్నర సంవత్సరాలుగా పార్టీని ప్రజలలో బలోపేతం చేస్తూ పార్టీని డోన్ నియోజకవర్గంలో గెలుపొందే దిశగా నిలబెడితే తీరా అప్పుడు ముందుకు రాని నాయకులూ ఎన్నికలు సమీపిస్తుంటంతో డోన్ గడ్డ మాదే అంటూ కొందరు నాయకులు అంటూ ఉన్నారని నేను డోన్ గడ్డలో పుట్టిన రైతు బిడ్డనే అని ఇన్ని రోజులు గడ్డి వేసింది వాళ్ళు కొసుకోని పోవడానికి కాదని మీ అందరి ఆశీర్వాదం ఆశీసులతో డోన్ గడ్డి గడ్డ ఎవరిదో డోన్ నియోజకవర్గ ఏన్నికలలో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం అని సవాళ్లు విసిరారు.
తెలుగుదేశం పార్టీ టికెట్ ఇంచార్జి ఏ పదవులైన నేను ఎవరినైనా అడిగానా… ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి !!
డోన్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమలలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డి అను నేను ఏ రోజు పార్టీలో పదవుల కోసం లేక టికెట్ కోసం నియోజకవర్గ ఇన్చార్జి కోసం ఏ రోజు ఆశించలేదని కానీ కోట్ల కేఈ కుటుంబాలు డోన్ నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి నన్ను బలి పశువును చేసి తీరా ఇప్పుడు డోన్ టికెట్టు తమదే అనడం ఎంతవరకు సమంజసం తమ స్వార్ధ రాజకీయం కోసం తనను బలిపశువు చేయడం ఎంతవరకు న్యాయం అంటూ కోట్ల,కేయి కుటుంబాలు అంటే తనకు ఎంతో గౌరవమని తీరా వారు అనుసరిస్తున్న రాజకీయాలు చూస్తుంటే రాజకీయంలో ఓనమాలు నేర్పిన గురువులు శిష్యునికి ఎంత విలువ ఇస్తున్నారో తెలుస్తుందని దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ రెబల్ గా పోటీ చేస్తున్నానంటూ రాజకీయ వేడికి తెర లేపిన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
గతంలో ధర్మవరం మన్నే సుబ్బారెడ్డిని డోన్ నియోజకవర్గ 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు నియమించి తీరా ఎన్నికలు రెండు నెలలు ముందుండగా సుబ్బారెడ్డికి మొండిచేయ్యి చూపుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ని డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో డోన్ నియోజకవర్గం లో గత పది రోజులుగా ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్ లేదా ఏ పార్టీలోనైనా చేయబోతున్నారంటూ ఉత్కంఠకు దారితీసింది ఈ నేపథ్యంలో ఈ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా తను పోటిచేస్త్తున్నట్లు ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి తన అభిమానుల సమక్షంలో తేల్చడంతో రాజకీయ వేడికి తెర లేపింది.
ఉత్కంఠకు తెర డోన్ టీడీపీ రెబల్ గా ప్రకటించుకున్న ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
RELATED ARTICLES