TEJA NEWS TV HINDUPUR : హిందూపురానికి బాలకృష్ణ 21న రానున్నారు. బాలయ్య కోసం అటు కార్యకర్తలు అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆయన హిందూపురానికి వస్తున్న షెడ్యూల్ ను పార్టీ కార్యాలయం విడుదల చేసింది. ఈ నెల
21వ తేదీ చిలమత్తురు కు ఉదయం 10:00 గంటలకు చేరుకుంటారు.
చిలమత్తూరు నందు 6 పంచాయితీలు కు సంబందించిన టీడిపి నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. 22 వ తేదీ 6 పంచాయితీలు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. 23వ తేదీ ఉదయం 07:30 గంటలకు మున్సిపల్ కూరగాయల మార్కెట్ సముదాయం నందు నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం భూమిపూజ లో పాల్గొంటారు.10:00 గంటలకు రహమత్ పూర్ కేజీబీపీ పాఠశాల నందు సోలార్ వాటర్ హీటర్ ప్రారంభిస్తారు. అనంతరం ఐదు పాఠశాలకు కంప్యూటర్లు పంపిణీ కార్యక్రమం లో పాల్గొంటారు.
స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం బెంగళూరు విమానాశ్రయం కు చేరుకుంటారనీ .. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు..
ఈనెల 21 న హిందూపురంకు బాలకృష్ణ రాక…!
RELATED ARTICLES