TEJA NEWS TV ALLAGADDA:
నంద్యాల పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కూతురు బైరెడ్డి శబరి విజయానికి టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలంతా కలసికట్టుగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఆదివారం సాయంత్రం ఆళ్లగడ్డ జనసేన పార్టీ ఇన్చార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి స్వగృహంలో ఆయన ఇరిగల సోదరులు, మాజీ కాటన్ బోర్డు డైరెక్టర్ సి పి వాసు తదితరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమార్తె విజయానికి అంతా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రజనీష్ రెడ్డి, జున్ను ప్రసాద్ రెడ్డి, ఇరిగల నారాయణరెడ్డి, విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు