మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీ వద్ద పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ నేటి నుండి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు ముఖ్యంగా యువతి యువకులు పాల్గొని తమవంతు గ్రామం పరిశుభ్రంగా ఉండే విధంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు..గ్రామ ప్రజలతో స్వచ్చ ప్రతిజ్ఞ చేయించారు.. తదనంతరం గ్రామ ప్రజలందరూ మొక్క నాటాలని సూచించారు..ఇట్టి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..
ఇబ్రహీంపూర్ లో ఘనంగా ప్రజాపాలన వేడుకలు
RELATED ARTICLES