తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
రాజంపేట మండలం కొత్త బోయిన పల్లె ఎస్. జె. యస్. యం ఉన్ పాఠశాలలో శుక్రవారం ఇన్ఫర్మేషన్ అండ్ కమున్యూకేషన్ టెక్నాలజీ
ట్రైనింగ్ ICT ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానో పాధ్యాయురాలు భారతి అధ్యక్షత
వహించగా మండల విద్యా శాఖాధికారి రఘు నాధ రాజు ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖాధికారి రఘు నాధ రాజు మాట్లాడుతూ
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ. ICT అనేది నెట్‌వర్క్ ఆధారిత పర్యవేక్షణ &
నియంత్రణ పరికర మని టెలికమ్యూనికేషన్స్, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు,
ఆడియోవిజువల్ ప్రాసెసింగ్ & ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లు, ప్రసార మాధ్యమాలు మొదలైన వాటిని
ఉపయోగించే సాంకేతిక సాధనాలను మరియు సేవలను సూచిస్తుందనీ తెలిపారు.
ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ ICTని ఒక నిర్దిష్ట మార్గంలో వివరించలేమనీ, ఎందుకంటే
ICT విధానాలు మరియు అమలులు ప్రతిరోజూ మారుతూ ఉంటాయనీ,ఇది మొబైల్ ఫోన్‌లు, కంప్యూ టర్‌లు
మొదలైన డిజిటల్ సమాచారాన్ని కలిగి ఉండే, నిల్వ చేసే మరియు నిర్వహించే ఏదైనా ఉత్పత్తిని కలిగి ఉంటుందనీ వివరించారు.
ఈ కార్య క్రమంలో రాజంపేట నియోజక వర్గం నుంచి రాజంపేట,నందలూరు
మండలాలు,రైల్వే కోడూరు నియోజక వర్గం నుంచి కోడూరు,పుల్లంపేట, పెనగ లూరు, ఓబులవారిపల్లి, చిట్వేల్ నుంచి
ఉపాధ్యా యిని ఉపాధ్యాయులు హాజరైనారు. మూడు రోజుల పాటు జరిగనున్న
ఈ కార్యక్రమంలో మొదటి రోజు మ్యాథ్స్ సిబ్బంది పాల్గొన్నగా,రెండో రోజు ఫిజికల్ సైన్స్ సిబ్బంది,
మూడో రోజు బయాలజీ సైన్స్ సిబ్బంది పాల్గొన నున్నారు.వీరికి శిక్షణ పొందిన సిబ్బంది
ఇన్ఫర్మేషన్ అండ్ కమున్యూకేషన్ టెక్నాలజీ అవగాన కల్పించనున్నారు.
ఇన్ఫర్మేషన్ అండ్ కమున్యూకేషన్ టెక్నాలజీ ట్రైనింగ్
RELATED ARTICLES