ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా చిప్పగిరి లక్ష్మీనారాయణ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు మీడియాతో మాట్లాడుతూ దాదాపు మూప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సేవలు అందించినందుకు *పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారికి,* *జిల్లా అధ్యక్షులు పరిగెల మురళి కృష్ణ గారికి* ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని, ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తామని, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను, కార్యకర్తలను అబిమానులను సమన్వయ పరుచుకుంటూ పార్టీని బలోపేతం చేసి గెలుపు దిశగా ముందుకు తీసుకెళ్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా చిప్పగిరి లక్ష్మీనారాయణ
RELATED ARTICLES