TEJA NEWS TV
నంద్యాల జిల్లా డోన్ మండలంలోని ఆవులదోడ్డి గ్రామ సమీపాన వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త ఆలమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తన కోట్ల రాఘవేంద్ర రెడ్డి ఆయన సతీమణి కోట్ల గౌరమ్మ లు ముఖ్యఅతితులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారిని ధర్మకర్త ఆలా మోహన్ రెడ్డి సత్కరించారు.
ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం ప్రత్యేక పూజలు అర్చనలు కోలాటాలతో అంబరాన్నంటింది.
ఇక్కడికి వచ్చిన భక్తులకు ధర్మకర్త ఆలమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ నలుమూలల నుండి బస్సు సౌకర్యాన్ని స్వామివారి గుడి వరకు ఏర్పాటుచేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఆలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
RELATED ARTICLES