ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరం నుంచి శనగపాడు వెళ్ళే రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ గంటలమ్మ తల్లి దేవాలయంలో హుండీలో చోరీ…
ఆలయం చుట్టూ లైట్లు ఉన్న లోపలికి ప్రవేశించిన దొంగలు విద్యుత్ సరఫరా నిలిపి వేసి గర్భగుడి కి వేసి ఉన్న చైన్లు తో వేసి ఉన్న రెండు తాళ్ళాలు పగులగొట్టారు.
అనంతరం అమ్మవారి పక్కనే ఉన్న హుండీ తాళ్ళాం పగుళ గొట్టి హుండీలో నగదు ఎత్తుకు పోయారు. ఇదే గుడిలో గత మూడు సంవత్సరాలలో రెండవ చోరి…
గతంలో హుండీనే ఎత్తుకు పోయిన చోరులు హుండీని తీసుకుని పోయి జాతీయ రహదారి పక్కనే మునగచర్ల వద్ద హుండీలో నగదు తీసుకుని హుండీని వదిలి వెళ్ళారు…
హుండిని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి నేటి వరకు దర్యాప్తు చేస్తునే ఉన్నారు…
దొంగలు దొరకలేదు కానీ అప్పుడు చోరికి గురైన హుండీ నేటికీ పోలీసుల స్వాధీనం లో ఉంది. ఇదిలా ఉంటే గత వారంలో ఇదే అనాసాగరం లోని ఆంజనేయ స్వామి గుడిలో భారీ హుండి హుండీనే చోరులు తస్కరించారు…
జాతీయ రహదారిని అనుకోని ఉండే ఈ దేవాలయంలో హుండీతో దానిలో సుమారు లక్షకు పైగా నగదు ఉన్నట్లు కమిటీ ఛైర్మన్ నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు…
ఆలయంలో దొంగలు పడ్డారు
RELATED ARTICLES