ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ (ఆయుష్ )అనిగండ్లపాడు వారి ఆధ్వర్యంలో మాగల్లు గ్రామంలో కెకె. వృద్ధాశ్రమంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
డాక్టర్. రత్న ప్రియదర్శిని పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరం (ఆయుష్) ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల అనిగండ్లపాడు వారి ఆధ్వర్యంలో మాగల్లు గ్రామంలో కెకె . వృద్ధాశ్రమంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు.
వైద్యాధికారిణి డాక్టర్. రత్న ప్రియదర్శిని వృద్ధులను పరీక్షించి వారికి మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, నరాలు నొప్పులు మొదలగు వ్యాధులకు ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు.
డాక్టర్ .వై .రత్న ప్రియదర్శిని పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు వైద్యశాల సిబ్బందితో కలిసి అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో వైధ్యశాల సిబ్బంది శ్రీమతి శైలజ,శ్రీజ, రాజారావు,మేఘన, మరియు యోగా గురువు గాడిపర్తి సీతారామారావు సేవలు అందించారు.
వృద్ధాశ్రమం నిర్వాహకులు శ్రీ కరిముల్ల, శ్రీమతి హసీనా బేగం పాల్గొన్నారు.
గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ డైరెక్టర్ . శ్రీ యం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
RELATED ARTICLES