సీసీఆర్ సంస్థ నుండి ఐడి కార్డు అందుకున్న రాణిపేట మక్ సుద్
అవినీతి రహిత భారత్ నిర్మాణం లో భాగస్వామిని ఐనందుకు ఆనందంగా ఉంది : మక్ సుద్
తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం, ముస్లిం పాలెం గ్రామానికి చెందిన రాణిపేట మక్ సుద్ 4-7-23 న సీసీఆర్ ఐడి కార్డు పొందుటకు కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్(సీసీఆర్)సంస్థ ఆన్లైన్ ఫామ్ నింపి,సంస్థ నందు సభ్యులుగా కొనసాగుటకు అర్హత పొందారు.ఇతనిపై సంస్థ విచారణ జరిపి ఐడి నెంబర్ ను కేటాయించింది. ,08-11-2023 న అతని వద్ద నుండి ₹20 ఇండియన్ నాన్ జ్యూడిషల్ ఈ స్టాంప్ పేపర్ నందు స్వీయ అఫిడవిట్ ను,సీసీఆర్ ప్రతినిధులు శిరీష్ బాబు,ఎలియాజర్ పల్లిపట్టులు సీసీఆర్ జేఎస్ గుత్తి త్యాగరాజు సమక్షంలో అఫిడవిట్ అందుకున్నారు.అఫిడవిట్ ను పరిశీలించి సీసీఆర్ జేఎస్ గుత్తి త్యాగరాజు, సీసీఆర్ ఐడి కార్డు ఇంచార్జి అండ్ జోనల్ సెక్రటరీ ఐన తిరుపతి కి చెందిన మార్గబందు లోకేష్ ద్వారా అందుకున్న సీసీఆర్ /231791 అను నెంబర్ గల ఐడి కార్డు ను అందజేయడం జరిగింది.సంస్థ నిబంధనల మేరకు సీసీఆర్ ఐడి కార్డు ను సద్వినియోగం చేసుకోవాలి అని, దుర్వినియోగం చేసినట్లుయితే సంస్థ తీసుకోను చట్ట పరమైన చర్యలకు భాద్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తూ.. ప్రజా ప్రయోజనం కోసం.. అవినీతి రహిత భారత్ కోసం కృషి చేయాలని సూచించారు. సీసీఆర్ నందు తనకు సభ్యత్వం కల్పించి, ఐడి కార్డు అందించి, నవ భారత నిర్మాణం లో భాగస్వామిని చేసినందుకు రాణిపేట మక్ సుద్ సీసీఆర్ సంస్థ సెంట్రల్ కమిటీ కి, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మంచి కట్ల అనిల్ కుమార్ కు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.సీసీఆర్ నందు సభ్యత్వం తీసుకోవాలి అని అనుకునే వారు ఉచితంగా వాలంటీర్ సభ్యులు గాను,ఐడి కార్డు సభ్యులు గాను గూగుల్ నందు హౌ టూ జాయిన్ సీసీఆర్ అని ఆంగ్లము లో చూసి, ఆన్లైన్ లింక్ ద్వారా గూగుల్ ఫామ్ నింపి చేరవచ్చని గుత్తి త్యాగరాజు తెలిపారు.
అవినీతి రహిత భారత్ నిర్మాణం లో భాగస్వామిని ఐనందుకు ఆనందంగా ఉంది : మక్ సుద్
RELATED ARTICLES