కరుణించని వర్ణుడు.
గత ఐదు రోజులగా ఒకటే కుంభవృష్టి.
అధిక వర్షపాతంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.
అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలి అంటూ హుకుం జారీ.
అవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి.
ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
భద్రాచలం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షపాతానికి నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ ప్రమాదగంటికలు మోగిస్తున్నాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కాలి నడకన మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సూచించారు.
సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు.జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు మరియు చెరువులు,వాగులు,నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి జిల్లా పోలీస్ శాఖ తరపున 24×7 అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్టుగా వారు తెలిపారు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ప్రజలు 100కు డయల్ వారి సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు.ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసు వారు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
అవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి :ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.
RELATED ARTICLES