Friday, January 24, 2025

అద్దె కార్ల మోసగాడు  దొరికాడా? పోలీస్ సారూ

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో  పదుల సంఖ్యలో చుట్టుపక్కల పట్టణాల్లో కార్ల యజమానులను మోసం చేసిన మోసగాడు పోలీసులకు సవాల్ గా మారాడు. నందిగామలో ముళ్ల డాక్టర్ శ్రీరామనేని రామకృష్ణ మరియు కొడుకు పవన్ సాయి అలియాస్ నాని  కార్ రెంటల్ వ్యాపారం చేస్తున్నారనే సాకుతో వారి వాహనాలను లీజుకు తీసుకుని, తర్వాత తనఖా పెడతాడు. విలువైన సుమారు 6  కార్లను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పవన్ సాయి అలియాస్ నాని మా కారును నెలవారీ అద్దెకు తీసుకుని మోసం చేశాడని ఇటీవల కార్ల యజమానులు చాలామంది  నందిగామ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా పవన్ సాయి అలియాస్ నాని తండ్రి శ్రీరామనేని రామకృష్ణ ముళ్ల డాక్టర్  కార్ రెంటల్స్ పేరుతో వ్యాపారం ప్రారంభించినట్లు మరియు ఫైనాన్స్ లో ఉన్న కార్లను  కంటిన్యూషన్ పేరుతో తాకట్టు పెట్టినట్టు  పోలీసులు గుర్తించారు. అతను కారు యజమానులతో కారు లీజు లేదా అద్దె ఒప్పందాన్ని కుదుర్చుకునేవాడు. తర్వాత  నాని వ్యక్తుల వద్ద వాహనాలను తనఖా పెట్టి ఒక్కొక్కరి నుంచి లక్షల వరకు అప్పులు తీసుకుంటాడు. ఆ డబ్బును విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడు. అతను యజమానుల నుండి తప్పించుకోని తిరగడం వలన వారు నందిగామ పోలీసులను ఆశ్రయించారు.

బాధితులు నందిగామ పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్నారని ఈ మోసగాళ్లు పోలీసులకి సవాల్ గా నిలిచారని ప్రజలు వాపోతున్నారు.

నందిగామలో  అద్దె చెల్లిస్తానని  చెప్పి కార్లు ఎత్తుకెళ్లి తాకట్టు పెట్టిన మోసగాడు  ఇప్పటివరకు దొరక్కపోవడం ఏమిటని నందిగామ ప్రజలు చెవులు కోరుకోవడం మొదలెట్టారు. కార్ల బాధితులు వాపోతున్నారు. పోలీస్ సారూ…. ముళ్ళ డాక్టర్ని   అతని కొడుకు ను నమ్మి అద్దెకు కార్లు ఇచ్చినందుకు మమ్మల్ని మోసం చేసి ఏకంగా కార్లే అమ్మేస్తాడు – అనుకోలేదని మా కార్లు మాకు ఇప్పించండి సారు…. అని నందిగామ పోలీస్ స్టేషన్లో  కేసులు పెట్టిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇన్ని రోజులైనా దొంగ దొరకకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు పోలీస్ సారూ… మోసగాళ్లను  పట్టుకోండి అని పోలీస్ స్టేషన్  చుట్టూ తిరుగుతూ…లబోదిబోమంటున్నారు. మా కార్లను, మా టూ వీలర్స్ ను  ఇప్పించండి అని పోలీసులను వేడుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular