Saturday, February 15, 2025

అట్టహాసంగా ప్రారంభమైన మారుధన్ రన్

అట్టహాసంగా ప్రారంభమైన మారుధన్ రన్…
-ఒక కిలోమీటర్… ఒక జీవితం.
-స్పెయిన్ ప్లేయర్ నృత్యాలు ఆదర్శ్.
-స్పెయిన్ దేశస్థలా కు ప్రజల ఘన స్వాగతం.
-ఫాదర్ దేవాలయం అద్భుతం.
-ఫాదర్ ఘన నివాళులు ప్రత్యేక పూజలు.

విశేష జనాల మధ్య నైన్త్ మారుధున్ రన్ కార్యక్రమం అట్టహసంగా ప్రారంభమైంది. ఒక కిలోమీటర్ పరిగెత్తితే ఒక జీవితం సురక్షితంగా ఉంటుందని స్పెయిన్ దేశస్థులు ప్లేయర్స్ భావించి నైన్త్ మారధున్ రన్ చేపట్టారు. మంగళవారం స్థానిక ఆర్డిటి దేవాలయం వద్ద తొలత స్పెయిన్ దేశస్థులకు పాదర్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు డప్పు మోదుతో పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాదర్ దేవాలయంలో వారిని సందర్శించి పాదర్ కు నమస్కరించి విగ్రహానికి నివాళులర్పించారు , ధర్మకర్త వేద పండితుడు ఆధ్వర్యంలో విశాల్ పెర్రర్ ,మ్యాంచు పెర్రర్ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏటీఎంల్, తిప్పేస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాంచు ఫెర్రర్ ,సతీమణి విశాల పెర్రర్, ఎ,టి,యల్, తిప్పేస్వామిలు మాట్లాడారు. తొమ్మిదవ మారుధున్ రన్ అనంతపురం నుండి ఈ కార్యక్రమం కుందుర్పి మిదుగా ప్రారంభమై బత్తలపల్లిలో ముగుస్తుంది అన్నారు. కాగా ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం 50 గ్రామాల మీదుగా కొనసాగుతుందని గుర్తు చేశారు. ఫలితంగా ఈ టీంలో 137 మంది ప్లేయర్స్ కలరని, 67 మంది అంతర్జాతీయ ప్లేయర్స్, 65 మంది ఇండియా ప్లేయర్స్ పాల్గొన్నారు. 2016లో హువాన్ అనే వ్యక్తి మారుధున్ రన్ కార్యక్రమం ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమానికి విరివిగా విచ్చేసిన ప్రజలను వారు తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విశాల్ ఫెర్రర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతపురం నుండి ముందుకు తీసుకోపోవడం చాలా గర్వించేదగ్గ విషయం అన్నారు. ఫాదర్ దేవాలయం చాలా అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గేయాలకు అనుగుణంగా స్పెయిన్ ప్లేయర్స్ నృత్యాలను ప్రదర్శించడం చూపర్లను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో స్పెయిన్ దేశపు రన్ ప్లేయర్స్ ఒక గ్రామంలో ఒక వ్యక్తిని దత్తకు తీసుకుంటారని తెలిపారు. ఆ వ్యక్తిని ఆర్ డి టి, సంస్థ ద్వారా ఉన్నత స్థాయికి ఎదగడానికి అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. తద్వారా ప్రజలు ,స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు ,సంస్కృతి, ప్రకృతి, తదితర వాటిపైన స్పెయిన్ ప్లేయర్లు ఆరా తీస్తారని తెలిపారు. ఫలితంగా వీటి పైన పరిశీలించిన అనంతరం ఆ నివేదిక జాబితాను స్పెయిన్ దేశస్థులకు నివేదించగా, ఆ దేశపు స్వచ్ఛంద సంస్థ తిరిగి ఆర్డిటి సంస్థకు నిధులు మంజూరు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి టి సిబ్బంది, మహిళా సంఘాలు కమ్మదూరు ,కుందుర్పి మండల ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular