శ్రీసిటీ, మార్చి 27, తేజన్యూస్ టీవీ
శ్రీసిటీలోని జపాన్‌కు చెందిన ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రాసెసింగ్ (IMOP – ఐమాప్) ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా అగ్నిమాపక శాఖకు విపత్తులను ఎదుర్కొనేందుకు అవసరమైన పలు పరికరాలను వితరణ ఇచ్చింది. తిరుపతి జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ ఆఫీసర్ అభ్యర్థన మేరకు పవర్ రంపాలు, జనరేటర్ తో పాటు 2.75 లక్షల రూపాయల విలువైన పలు పరికరాలను విరాళంగా అందచేశారు.శ్రీసిటీ అగ్నిమాపక కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో IMOP మేనేజింగ్ డైరెక్టర్ తైజో ఇవామీ నుండి పరికరాలను స్వీకరించిన జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, తమ అభ్యర్థనకు వెంటనే స్పందించిన ఐమాప్ సంస్థకు కృతఙ్ఞతలు తెలిపారు.శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో ఐమాప్ సీఎస్సార్ చర్యలను అభినందించారు. ఈ ప్రాంత భద్రత మరియు సమాజ శ్రేయస్సు పట్ల ఐమాప్ నిబద్ధతకు ఇది సాక్ష్యంగా నిలుస్తుందన్నారు.ఐమాప్ అసిస్టెంట్ ఎండీ హిరోకి ఇమై, సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ తానెగావా, హరిహరన్, శ్రీసిటీ ప్రతినిధులు రమేష్ కుమార్, వై.రమేష్, భగవాన్, సురేంద్ర కుమార్, శ్రీసిటీ ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పై వితరణతో పాటు గతంలోనూ ఐమాప్ తన సీఎస్ఆర్ చర్యల ద్వారా స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, శ్రీసిటీ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (IALA)కి రూ. 29 లక్షలతో అంబులెన్స్, తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రూ. 10 లక్షలతో యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ (UTM), మూడు డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు వంటి విలువైన విరాళాలను అందచేసింది.
అగ్నిమాపక శాఖకు శ్రీసిటీ-ఐమాప్ పరిశ్రమ వితరణ రూ. 2.75 లక్షల విలువైన పరికరాలు పంపిణీ
RELATED ARTICLES