చేగుంట (తేజ న్యూస్ ) బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపిడన ద్రోని వలన రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు గత మూడు రోజులనుండి కురువడంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్న నేపథ్యంలో జిల్లా పాలనాధికారి రాహుల్ రాజు పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. కాగా జిల్లాలోని చెగుంట మండల కేంద్రంల్లో అంగన్వాడీ కేంద్రానికి సెలవు ఇవ్వకుండా నడుపడంతో కేంద్రానికి హాజరైన చిన్నారులు చల్లటి వాతావరణం, ఇదురు గాలులకు వణుకుతు భయబ్రాంతులకు గురైయ్యారు. ఈ విషయమై సీడీపీఓ ను వివరణ కోరుదామని ఫోన్ లో ప్రయత్నించగా అందుబాటులో కి రాలేదు. మండలం లోని గ్రామాల్లో ప్రభుత్వం పాఠశాలలకు మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఉండగా అంగన్వాడి స్కూల్ లకు మాత్రం ఎందుకు సెలవు ఉండదంటూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.గ్రామాలలో అంగన్వాడి స్కూలు కొన్ని స్వంత భవనాలు మరియు కొన్ని కిరాయికి ఉన్న ఇండ్లు. శితిలావస్థలలో ఉండగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం లో అంగన్వాడి స్కూల్లు తెరిస్తే నాలుగు ఐదు ఏళ్ల చిన్నారులకు ఏమైనా జరగరానిది జరుగుతే దీనికి ఎవరు బాధ్యులని తల్లి తండ్రులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడి స్కూలులకు సెలవు వర్తించదా…? చిన్నారులకేమైన అయితే భాద్యులేవరు
RELATED ARTICLES