రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నంద్యాల జిల్లా S.S.A తరఫున ఎంపిక చేయబడిన కెరీర్ మరియు మానసిక కౌన్సిలర్ N.మౌలాలి యొక్క పనితీరును గురువారం నాడు నంద్యాల జిల్లా GCDO శ్రీమతి నాగ సులోచన మరియు రాష్ట్ర PMU కోఆర్డినేటర్ డాక్టర్ ఛాయేంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9,10 తరగతుల విద్యార్థులకు కెరీర్ మరియు మానసిక ఆరోగ్య స్థితుల గురించి తెలియజేయడం కోసం ప్రత్యేకంగా 3 కౌన్సిలర్లని నియమించడం జరిగిందని వీరు జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9,10 తరగతుల విద్యార్థులకు ఒక వారం పాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఈ శిక్షణ కార్యక్రమం రుద్రవరం మండలంలో గతవారం నుంచి మొదలైందని రుద్రవరం మండలంలోని ఎల్లా వత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతవారం శిక్షణ కార్యక్రమం పూర్తిచేసుకుని రుద్రవరం మండల కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలలో కొనసాగుతుందని ఈ సందర్భంగా కౌన్సిలర్ యొక్క పనితీరును తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రవరం MEO 1 రఘురామయ్య MEO 2 లక్ష్మీదేవి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు JV సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
S.S.A తరపున నంద్యాల జిల్లాకు ముగ్గురు కెరీర్ మరియు మానసిక కౌన్సిలర్లు ఎంపిక
RELATED ARTICLES