TEJA NEWS TV : వైయస్ జగన్ నవరత్నాలతో ప్రతి ఇంటికి లబ్ది,గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : కంచికచర్ల మండలంలోని కీసర గ్రామంలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శుక్రవారం ప్రారంభించారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి అమ్మ ఒడి, చేయూత, విద్యాదీవేన, జగనన్న విద్యా కానుక, జగనన్న చేదోడు, వివిధ రకాల పెన్షన్లు వంటి వివిధ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా ప్రభుత్వం ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ద్వారా ఇంటికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయకపోగా జన్మభూమి కమిటీల పేరుతో ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ ప్రజలను తిప్పుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల కష్టాలను తెలుసుకొని చేస్తానని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. కావున 2024 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజల సిద్ధంగా ఉండాలన్నారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..
