Teja News TV శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం…
తలసీమియా బాధితుల కోసం రక్త దానం చేసి మత సామరస్యం చాటుకొన్న హిందూ ముస్లిం సోదరులు, మానవత్వమే మా మతం వసుదైక కుటుంబ నిర్మాణమే మా ధ్యేయం అనే నినాదంతో టిప్పు సుల్తాన్ మానవతా రక్త దాన సంఘం. వ్యవస్థాపక అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ వైద్య శాల రక్త నిధి (బ్లడ్ బ్యాంక్)లో తలసీమియా బాధితుల కోసం రక్త దాన చైతన్య కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తలసీమియా బాధితుల కు ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ మానవతా రక్త దాన సంఘ సభ్యులు ఫయాజ్.అబ్రార్.షాహిద్. బసవేశ్వర కాలనీ మిత్రబృందం రాము. మంజు.చంద్ర తలసీమియా బాధితుల కోసం రక్త దానం చేశారు. రక్తదాతలను అభినందించి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.