Sunday, September 14, 2025

BYSS జాతీయ యువ మోర్చా అధ్యక్షుడిగా మద్దిశెట్టి సామేల్‌ నియామకం

భారతీయ యువ సేవా సంఘ్‌ (BYSS) న్యూ ఢిల్లీ తరఫున తెలంగాణకు చెందిన మద్దిశెట్టి సామేల్‌ను జాతీయ యువ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు.

సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. అడ్వ. సౌరవ్ దాస్ ఈ నియామకాన్ని ప్రకటిస్తూ, యువశక్తి దేశ భవిష్యత్తుకు పునాది అనే నమ్మకంతో BYSS ముందుకు సాగుతోందని తెలిపారు.

BYSS సంస్థ భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, MSME మంత్రిత్వ శాఖలతో అనుబంధంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతాలతో పనిచేస్తూ, సమాజ సేవ మరియు యువజనాభ్యున్నతి లక్ష్యంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.

మద్దిశెట్టి సామేల్‌ అనుభవం, నిబద్ధతతో సంస్థ లక్ష్య సాధనకు మరింత బలాన్నిస్తారని, యువజన సాధికారత, సామాజిక సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.

“దేశం కోసం యువత – యువత ద్వారా దేశం” అనే నినాదంతో సంస్థ ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular