జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా డోన్ నియోజకవర్గం వైష్ణవి డిగ్రీ కళాశాలలో “BJYM నమో నా మొదటి ఓటు దేశం కోసం ఆంధ్రుడు గా నా మొదటి ఓటు మోడీ కే ” ప్రచార కార్యక్రమంతో జరిగిన ఓటర్ల సదస్సు …
జనవరి 25 2024 న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా డోన్ నియోజకవర్గంలోని డోన్ పట్టణంలో వైష్ణవి డిగ్రీ కళాశాలలో నూతన ఓటర్లను ఉద్దేశించి అవగాహన సదస్సు కార్యక్రమమును నిర్వహించారు.ఏపీ బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్టా వంశీ సూచనలతో మరియు నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి బై రెడ్డి శబరి ఆదేశాలతో డోన్ బిజెపి &బిజెవైఎం నాయకులు కొట్టె మల్లికార్జున నేతృత్వంలో నూతన ఓటర్ల సదస్సు జరిగింది .ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా డోన్ పట్టణం తాహసిల్దార్ విద్యాసాగర్ రావు మరియు వైష్ణవి డిగ్రీ కళాశాల డైరెక్టర్ చంద్రకళా రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హాజరవ్వడం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి స్థానిక ఎమ్మార్వో విద్యాసాగర్ రావు, వీ ఆర్ వో సునీల్ మరియు డైరెక్టర్ చంద్ర కలారెడ్డి నూతన ఓటర్లను ఉద్దేశించి మీ మొదటి ఓటు దేశ అభివృద్ధి కోసం దేశం కోసం వేసి ,దేశ పురోగతిలో యువత భాగస్వాములు అవ్వాలని పేర్కొన్నారు . Bjym నమో నా మొదటి ఓటు దేశం కోసం, నా మొదటి ఓటు మోడీకే అనే పేరుతో ఉన్న గత 9 సంవత్సారాలలో జరిగిన అభివృద్ధితో కూడిన పేపర్ నమూనాను ఎమ్మార్వో విద్యాసాగర్ రావు, కళాశాల డైరెక్టర్ చంద్రకళా రెడ్డి ,ప్రిన్సిపల్ రాజశేఖర్ తో పాటు , కళాశాల విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది.జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా వైష్ణవి డిగ్రీ కళాశాలలో నిర్వహించినటువంటి నూతన ఓటర్ల సదస్సు “బీజేవైఎం నమో నా మొదటి ఓటు దేశం కోసం నా మొదటి ఓటు మోడీకే” కార్యక్రమమును విజయవంతం చేసిన వైష్ణవి డిగ్రీ కళాశాల యాజమాన్యానికి , డైరెక్టర్ చంద్రకళా రెడ్డికి ప్రిన్సిపల్ రాజశేఖర్ , స్థానిక ఎమ్మార్వో విద్యాసాగర్ , విఆర్వో సునీల్, విద్యార్థులు అందరికీ కొట్టె మల్లికార్జున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.