TEJA NEWS TV: గత 23 రోజులుగా నందమూరి తారకతర్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. విదేశీ వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక వైద్యం అందించింది. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.
ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆరోగ్యం పాడైన ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 23 రోజులుగా అక్కడే ఆయనకు వైద్యం అందుతోంది. కార్డియాక్ అరెస్ట్ తీవ్రత కారణంగా తారకరత్న శరీరంలోని పలు అవయవాలు పని చేయకుండా పోయాయి. మెదడు సైతం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగింది. ఆయనకు ప్రత్యేక వైద్యం అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అత్యంత విషమంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన కన్నుమూశారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
BIG BREAKING: నందమూరి తారకరత్న కన్నుమూత
RELATED ARTICLES