కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం:
డిసెంబర్ : 2025.
జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటి కన్వీనరు గా నియమితులైన( బిఎల్ఎన్ చారి) బి లక్ష్మీ నరసింహ చారి మాట్లాడుతూ,
నిరంతరం జర్నలిస్టుల సమస్యల పై పోరాడుతున్న డెమొక్రటిక్ జర్నలిస్టు యూనియన్ డీజేయూఅని జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ లో తనను కన్వీనర్ గా నియమించినందుకు జాతీయ కమిటీ చైర్మన్ కు తన తోటి కమిటీ కన్వీనర్లకు ,ఇతర కమిటీ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని
జర్నలిస్టులందరూ ఉమ్మడిగా ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవడం వలన జర్నలిస్టు సంఘాల పనితీరుతో పాటు, జర్నలిస్టులకు ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించుకోవచ్చునని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డీజేయు తన వంతు కర్తవ్యం గా అనునిత్యం పోరాడుతూ ముందుంటుందని, ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టుల వృత్తిలో కొనసాగుతూ అక్రిడేషన్లకు నోచుకోని డెస్క్ జర్నలిస్టులు గతo లో మంజూరు అయినా అక్రిడేషన్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 252 ను సవరించాలని. జీవో252 వల్ల డెస్క్ జర్నలిస్టులకు, ఇతర చిన్న, డిజిటల్ మీడియాలకు అక్రిడేషన్లలలో కోత విధిస్తారని ప్రచారం అవుతున్న నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి పలు డిమాండ్లపై మెమొరండం ఇవ్వడం జరిగిందనీ. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తో పాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇవ్వడం పట్ల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారనీ. ఎప్పుడు ఇలాగే అందరూ ఐక్యతతో ఉండి పోరాడితే సమస్యలు పరిష్కారం అవుతాయాని
జర్నలిస్టుల ఐక్యత కొరకు జేఏసీ ఏర్పడడం కొరకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా,(డి జే యు) జాతీయ కన్వీనర్ బి. ఎన్.చారి
RELATED ARTICLES



