TEJANEWSTV TELANGANA
2026 కొత్త సంవత్సరంలోనైనా విద్యుత్ ఆర్టిజల జీవితాలు మారుతాయి అని కామారెడ్డి జిల్లా ఆర్టిజన్లు అటు ప్రభుత్వం వైపు, ఇటు యాజమాన్యం వైపు, ఆశగా ఎదురు చూస్తున్నామని సీనియర్ ఆర్టిజన్ జిల్లా నాయకులు, ఎం నాంపల్లి.ప్రభుత్వం పట్ల ఆశాభావాన్ని వ్యక్త పరిచారు. కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఆర్టిజన్ కార్మికులను మోసం చేసిందని, తమను పర్మినెంట్ చేసిందని అబద్ధపు మాటలతో కాలయాపన చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 20వేల ఆర్టిజన్ కుటుంబాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 24 గంటల సరఫరాకు నిరంతరం ఆర్టిజన్ కార్మికుల కృషి చేస్తున్నారని, ఇదే క్రమంలో చాలీచాలని వేతనాలతో, గత 20,,25 సంవత్సరాల నుండి వెట్టిచాకిరికి గురయ్యారని తన నిస్సహాయతను వ్యక్తపరిచారు. విద్యుత్ సంస్థలో సమాన పనికి సమాన వేతనం అందించాలని, ఏపీఎస్పీ రూల్స్ వర్తింపజేయాలని, ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక పక్షాన నిలబడుతుందని వారన్నారు. ఓకే సంస్థలో ఒకే రోల్ ను ప్రవేశపెట్టాలని బ్రిటిష్ కాలం నాటి రూల్స్ ను విద్యుత్ ఆర్టిజన్ కార్మికులపై అమలు పరుస్తూ వారి యొక్క జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తాము సంస్థను నమ్ముకుని నిస్వార్ధంగా నిబద్ధతతో సంస్థ అభివృద్ధికి తమ శక్తిని వయస్సును ధారపోశామని, వీటన్నింటినీ ప్రభుత్వం గుర్తించాలని వారన్నారు. నేడు 20వేల ఆర్టిజన్ కార్మికులు చాలీచాలని వేతనాలతో దుర్భరమైన జీవితాలతో భార్యా పిల్లలను పోషించలేని దీనస్థితిలో ఉన్నారని, సమాజానికి వెలుగునిచ్చే కార్మికుని జీవితం అంధకారంలోకి నెట్టబడిందని వారు కన్నీరు మున్నేరయ్యారు. అటు చావలేక బతకలేక కుటుంబ పోషణ భారమై మానసిక వేదనతో బ్రతుకులు వెలదీస్తున్నారని వారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, ఈ యొక్క కొత్త సంవత్సరంలోనైనా, విద్యుత్ ఆర్టిజన్ బతుకులలో వెలుగులు నింపాలని, ఏపీ ఎస్పీ రూల్స్ కల్పించి, 20వేల పైచిలుకు కుటుంబాలను ఆదుకొని వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. 20 వేల పైచిలుకు ఆర్టిజన్ కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాయని అన్నారు.
2026 క్రొత్త సంవత్సరంలోనైనా…..విద్యుత్ ఆర్టిజన్ జీవితాలు మారేనా……??
RELATED ARTICLES



