భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌గా ఇస్లావత్ రుక్మిణి, ఉప సర్పంచ్‌గా అంతటి రామకృష్ణతో పాటు 14 మంది వార్డు సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి గారిచే ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్, ముందుగా అయ్యన్నపాలెం గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ సంఖ్యలో గ్రామ ప్రజలతో కలిసి ర్యాలీగా చండ్రుగొండకు చేరుకుని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
చండ్రుగొండ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
RELATED ARTICLES



