

రిపోర్టర్ పి శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
తేజ న్యూస్ టీవీ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అర్బన్ హెల్త్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని పోలియో వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పలువురు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో రహిత సమాజంగా మన దేశాన్ని తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నాయని ఇందులో భాగంగా ప్రతి ఏటా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. 0 నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్, ఎంపీడీవో నూర్జహాన్, అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ, హెల్త్ ఆఫీసర్ వంగాల దస్తగిరి రెడ్డి, సూపర్వైజర్ శాంతి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు, ఫార్మసిస్ట్ సంజీవ రాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.



