ఎన్టీఆర్ జిల్లా నందిగామ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ (AP SCPCR) ఛైర్‌పర్సన్ మరియు సభ్యుల నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూలు అమరావతిలో నాలుగవ రోజుకు చేరుకున్నాయి. మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూ ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలను మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలని అధికారులకు సూచనలు ఇస్తున్నారు.
ఇంటర్వ్యూ కమిటీలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శ్రీ వి.ఎస్.బి.జి. పార్థసారథి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కమిటీ సభ్యులుగా పాల్గొని అభ్యర్థులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నాలుగవ రోజు ఇంటర్వ్యూలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు చురుకుగా పాల్గొని, అభ్యర్థుల అనుభవం, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన, పరిపాలనా సామర్థ్యం వంటి అంశాలను లోతుగా పరిశీలించారు.బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు నిబద్ధతతో పని చేయగల అర్హులైన వ్యక్తులను ఎంపిక చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నియామక ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ నియామక ఇంటర్వ్యూలు
RELATED ARTICLES



