TEJANEWSTV : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు ఈ. గోవింద్ గౌడ్, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు శుక్రవారం అమావాస్య సందర్భంగా దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం కోసం ప్రతి నెలా రూ.15,000 విరాళం అందిస్తామని ప్రకటించారు. భక్తులకు ఆహారసేవలు అందించడంలో ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ వీరనాగప్ప, మండల కమిటీ సభ్యులు, మైనారిటీ మండల అధ్యక్షులు మొయిన్, టిడిపి నాయకులు వీరన్న గౌడ్, లోకేష్ నాయక్, హుస్సేన్ పీరా, దీదీ, నాగప్ప, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.
దేవరగట్టులో టీడీపీ నాయకుల ప్రత్యేక పూజలు — ఆలయానికి భారీ విరాళం!
RELATED ARTICLES



