

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ: గెలుపులో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు – చిట్టెం శెట్టి నవీన్
చండ్రుగొండ మండలం, డిసెంబర్ 16:
చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గుగులోత్ బాబు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించగా, యాసం లక్ష్మి ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా వారి గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి జారే ప్రధాన అనుచరుడు చిట్టెం శెట్టి నవీన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
గ్రామంలో కొంతమంది కుట్రపూరిత రాజకీయాలు చేసినప్పటికీ, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని పార్టీని విజయపథంలో నడిపించిన వారందరినీ ఆయన అభినందించారు. ఈ గెలుపులో యాసం కాశీ విశ్వనాథ్, గాదే రామకృష్ణ కీలక పాత్ర పోషించి పోకలగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డారని పేర్కొన్నారు.
కష్టపడిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అలాగే జారే ఆదినారాయణ సూచనల మేరకు గ్రామ అభివృద్ధిలో ముందుండి పనిచేస్తామని, పార్టీ అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో మండల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చిట్టెం శెట్టి నవీన్ అన్నారు.



