Thursday, December 4, 2025

ఎలక్షన్ల వేల నాటు కోళ్ల రచ్చ

గంప కింద కోళ్లు మాయం.

ఊరంతా నాటుకోడి కూర వాసనే.

అందరు శాఖాహారులే కోళ్లు మాత్రం కనబడడం లేదు.

వార్నింగ్ ఇచ్చిన జిల్లా న్యాయస్థానం.

కోళ్ల వేటలో పోలీస్ యంత్రాంగం.

వేలంపాటకు అసలు కోళ్లకు బదులుగా వేరే కోళ్లు.

ఎలక్షన్ల వేల నాటు కోళ్ల రచ్చ.

తేజ న్యూస్
ములుగు జిల్లా.


జిల్లాలోని కొన్ని మండలాలలో పోలీస్ శాఖ తప్పుడు అడుగులు వేస్తోంది. కోడిపందాలు ఆడుతున్న వారి వద్ద  నుండీ పట్టుకున్న కోడిపుంజులను కోర్టులో ప్రవేశపెట్టక పోవడమే కాకుండా ఆ కోడిపుంజులను భాజాప్తుగా ఆరగించారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టుకున్న పుంజులను కేసు చేసి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆయా పోలీస్ శాఖ ఎస్ హెచ్ ఓ మాత్రం  ముందుగానే కోళ్లను వేలంపాట వేసాము, వచ్చిన పైకం న్యాయస్థానంలో డిపాజిట్ చేయడానికి వచ్చాము అంటూ జడ్జికి  చెప్పినట్టుగా తెలుస్తోంది. కాగా దానికి  స్పందించిన న్యాయస్థానం మీరే వేలంపాట వేసుకొని మీరే డిపాజిట్ చేసుకుంటే ఇంకా కోర్టులతో పనే ఉంటుంది అని ఘాటుగా స్పందించినట్టుగా జిల్లాలో ఈ వార్త  పందెం కోడై కూస్తుంది . న్యాయస్థానం ప్రమేయం లేనిదే మిమ్మల్ని ఎవరూ వేలం పాట వేయమన్నారు అని మందలిచ్చినట్టుగా గట్టిగా వినపడుతోంది.
ఈ మేరకు పట్టుకున్న కోళ్లను తీసుకొచ్చి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని హుకుం జారీ చేసినట్టుగా  తెలుస్తోంది.
కాగా   ఉదయం   సదరు పోలీస్ అధికారులు పుంజుల  వెతుకులాటలో నిమగ్నమై వేలంపాట సమయానికి కోడిపుంజులను  పట్టుకొని కోర్టులో హాజరు పరిచే విధంగా కోడిపుంజుల వేటలో తన మునక్కలైనట్టుగా ఆరోపణలు వినబడుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ  పట్టుకున్న పుంజులను,కేసు చేసి నిజాయితీగా కోర్టులో ప్రవేశపెడితే ఇలాంటి ఇబ్బందులు రావు కదా సారు అని ప్రజానీకం  వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈతతంగమంతా ఇలా ఉండగా  అసలు పట్టుకున్న పందెం పుంజులు ఎక్కడికి పోయాయి.? అనే సందేహాలు  మొదలయ్యాయి.
పట్టుకున్న పుంజులకు బదులుగా వేరే పుంజులను వేలంపాటలో పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది.?. అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
నాటుకోడిని తినాలనిపిస్తే డైరెక్ట్ గా కొనుక్కొని తింటే ఎవరు కాదంటారు. వేలం పాటలో అందించడానికి
మరొక కోళ్లను కూడా కొనాల్సిందే,  బదులుగా కోర్టులో డిపాజిట్ చేయడానికి సొంత డబ్బులే తీయాల్సినా పరిస్థితి లీగల్ గానే వచ్చింది దానిలో ప్రయోజనం ఏముంది,
అంటూ మండలంలో ప్రజలు ఆయా పోలీస్ అధికారి  పై కుయుక్తులు విసురుతున్నారు.
నాటుకోడి వాసన ఊరంతా వచ్చినా మీకు రాలేదా సారు అని హాస్యాస్పదంగా విమర్శలు గుప్పిస్తున్నారు. జరిగిన పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు ఈ ఘటనపై విశేషంగా స్పందించారు.
ఎంత కాలం నుండీ ఈ కోడిపుంజుల ఆరగించటం  నడుస్తోందో అని అనుమానo వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం చేయాల్సిన అధికారులే తప్పులో కాలేస్తుంటే మరి న్యాయం ఎక్కడుంటుందో వెతకాలి మరి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular