Thursday, December 4, 2025

అడవి జంతువుల వేట కోసం తయారు చేసిన నాటు బాంబును కొరికి కుక్క మృతి

తేజ న్యూస్ టీవీ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం

తేదీ: 03.12.2025



కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై దొరకిన ఉల్లిగడ్డ ఆకారంలోని నాటు బాంబును, తినదగిన పదార్థమని భావించి ఒక కుక్క కొరకడంతో అది పేలిపోయి, కుక్క అక్కడికక్కడే మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

రైల్వే స్టేషన్ సమీపంలో చెత్తను పారేసే ప్రదేశం వద్ద నుంచి ఆ కుక్క నాటుబాంబును తీసుకుని వచ్చి కొరకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన వివరించారు. అడవి జంతువులను వేటాడడానికి తయారు చేసిన నాటు బాంబులను చెత్తలో పడేసిన వ్యక్తుల గుర్తింపుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు.

“ఈ ఘటనలో మరే ఇతర కోణం లేదు — సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దు” : ఎస్పీ

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాలు అసత్యమని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు అపనమ్మకాలు, అపోహలు వ్యాప్తి చెందకుండా సోషల్ మీడియాలో నిరాధారమైన పోస్టులను చేయకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular