భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – తేజ న్యూస్ టీవీ
తేదీ: 04–12–2025
స్థలం: చండ్రుగొండ మండలం, తుంగారం గ్రామపంచాయతీ
తుంగారం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు అనంతరం పాత్రికేయ మిత్రులతో గుగులోత్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాల పేరుతో ప్రజలను మోసగించిందని తీవ్రంగా విమర్శించారు.
ఇప్పటివరకు గ్రామంలో ఎటువంటి ముఖ్యమైన అభివృద్ధి పనులు జరగలేదని, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకుని ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి పట్ల కట్టుబాటు ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని తుంగారం గ్రామ ప్రజలకు ఆయన అభ్యర్థించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాలలో అనుబంధాన్ని బలంగా నాటుకుంది: గుగులోత్ ప్రవీణ్ ప్రకాష్
RELATED ARTICLES



