Wednesday, December 3, 2025

హోళగుంద  పోలీసు స్టేషన్ ను  వార్షిక తనిఖీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ   విక్రాంత్ పాటిల్ ఐపియస్

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు
టూ వీలర్ బైక్ లకు హెల్మెంట్ కంపల్సరీ

కర్నూలు జిల్లా… ఆలూరు తాలూకు


హోళగుంద  పోలీసు స్టేషన్ ను  వార్షిక తనిఖీ చేసిన … కర్నూలు  జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.

హోళగుంద  పోలీసు స్టేషన్ ను కర్నూలు  జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు  బుధవారం  వార్షిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. 

పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో పెండింగ్‌ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు,  వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ఆరా తీశారు.

డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలన్నారు. కేసులు నమోదుచేసి శిక్షలు పడేవిధంగా చేయాలన్నారు.

ప్రాపర్టీ కేసులను చేధించి  రికవరీలు చేయాలన్నారు.

విజిబుల్‌ పోలీసింగ్‌ చేయాలన్నారు.

బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.

సైబర్ నేరాలపై, మహిళల చట్టాల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

జిల్లా ఎస్పీ గారితో పాటు పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య , ఆలూరు సిఐ రవి శంకర్ రెడ్డి,  డి సి ఆర్ బి సి ఐ గుణశేఖర్ బాబు, హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్  పోలీస్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular