Tuesday, December 2, 2025

లంచాల వలయంలో మునిగి తేలుతున్న   ములుగు జిల్లాలోని కొందరు కోర్టు కానిస్టేబుళ్లు

TEJANEWSTV TELANGANA :

కాసుల రాజులు కోర్టు కానిస్టేబుళ్లు!

ముద్దాయిలను భయభ్రాంతులను చేస్తున్న  కోర్టు కానిస్టేబుల్ ల సొంత జరిమానాలు.

జడ్జి వేసే చలానా కంటే కోర్టు కానిస్టేబుళ్లు  వేసే జరిమానే ఎక్కువ.

లంచాల వలయంలో మునిగి తేలుతున్న   ములుగు,  జిల్లాలోని కొందరు కోర్టు కానిస్టేబుళ్లు.

ముడుపులు అప్పజెప్పలేక బంబేలెత్తిపోతున్న ఏజెన్సీ లోనీ ముద్దాయిలు.

  అడిగినంత చెల్లిస్తేనే వారికి న్యాయం.

లేకపోతే కోర్టు చుట్టూ ప్రదర్శనాలే.

స్వీపర్లు సైతం లంచం పుచ్చుకోవడంలో నేర్పరులే నట.

  న్యాయం కంటే ముడుపులు ముట్ట చెప్పడమే ప్రధాన అజెండా.

  విమర్శలు గుప్పిస్తున్న సదరు విద్యావేత్తలు సీనియర్ లాయర్లు. 

జిల్లా ఎస్పీ, జిల్లాలలోని కోర్టు కానిస్టేబుల్స్  పై నిగా పెట్టాలి అంటూ వెళ్ళు  వెత్తుతున్న  విమర్శలు.

తేజ న్యూస్.
ములుగు జిల్లా.

దేవుడు కరుణించినా పూజారి కరుణించడు అనే సామెత ములుగు,  జిల్లా కోర్టు కానిస్టేబుల్ ల వైఖరికి సరిగా అద్దం పడుతోంది .   న్యాయం కోసం జిల్లా కోర్టుకు వెళ్లిన ముద్దాయిలకు కోర్టు కానిస్టేబుల్ ద్వారా చేదు అనుభవం ఎదురవుతుంది అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్జీలు వేసే చలానాల కంటే కోర్టు కానిస్టేబుల్ వేసే జరిమానాలే ముద్దాయిలను కంగుతినేలా చేస్తోంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ముద్దాయిలు తప్పు చేయాలంటే ఎస్సై సీఐలకు భయపడతారు, కానీ ములుగు జిల్లాలో మాత్రం కోర్టు కానిస్టేబుల్ లకు భయపడవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా వ్యాప్తంగా ముద్దాయిలు కొంతమంది కోర్టు కానిస్టేబుల్ లపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితులు సంతరించుకున్నాయి.
*జడ్జ్ వేసే చలానా కొంత. కోర్టు కానిస్టేబుల్ వేసే చలానా మరికొంత.*
చిన్న పెద్ద నేరాలకు జిల్లా న్యాయస్థానం 1000 నుండి 2500 వరకు ముద్దాయిలకు  జరిమానా విధిస్తే. కోర్టు కానిస్టేబుల్ లు మాత్రం, వీలును బట్టి 1000 కి పదింతలు,కుదిరితే 20 వేల వరకు ముద్దాయిల నుండి వసూలు చేస్తున్నట్టు బలమైన ఆరోపణలు  వినిపిస్తున్నాయి.
*పైకం చెల్లిస్తేనే న్యాయం*
న్యాయస్థానం సదరు ముద్దాయికి ఎంత చలానా కట్టాలని సూచిస్తున్నారో,కోర్టు కానిస్టేబుల్  ముద్దాయికి తెలపకపోవడం,వారు చేసిన నేరాన్ని పదే పదే లేవనెత్తుతూ వారిని భయభ్రాంతులకు గురిచేసి వారు చెప్పిన పైకాన్ని చెల్లించే విధంగా అంగీకరించే దిశకు తీసుకురావడం , చివరికి శిక్ష భయంతో కోర్టు కానిస్టేబుల్ లకు వారు అడిగిన పైకం ముట్ట చెప్పడం జరుగుతోంది  అని ఇరు జిల్లాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా  న్యాయం జరుగుద్ది అని అభయ హస్తం ఇవ్వడం జడ్జి ఎవరో?
కోర్టు కానిస్టేబుల్ ఎవరో?.
తీర్పునిచ్చేది ఎవరో?
కూడా తెలియకుండా ఉంది అంటూ ప్రజలు,ముద్దాయిలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నట్టు తెలుస్తోంది. జరిగిన పరిణామాలు కూడా ఆద్యం పోస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతిఫలం మాత్రం ప్రజలలో లా అండ్ ఆర్డర్ మీద నమ్మకం పోయే పరిస్థితులకు కోర్టు కానిస్టేబుల్ ల ముడుపుల దందా ఆ దిశగా  తావినిచ్చాయి అని వేరే చెప్పనవసరం లేదు.

*టీ డబ్బులు కూడా ముద్దాయి దగ్గరే వసూల్.*
శిక్ష భయంతో ఉన్న ముద్దాయి దగ్గర సదరు న్యాయస్థానంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, కోర్ట్ కానిస్టేబుల్స్ కలిసి ముద్దాయి దగ్గరే  టీ తాగి,బాధితులని టీ డబ్బులు కట్టమంటున్నారు అని ముద్దాయిలు  ఆధారాలతో మీడియాను ఆశ్రయించారు.
*రాజకీయ నాయకుల చెప్పు చేతల్లోనే పలువురు  కోర్టు కానిస్టేబుళ్లు.*
  రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో కోర్టు కానిస్టేబుల్ లు ఉన్నారని నిర్వచనానికి అద్దం పట్టేలా
వివిధ కేసుల పాలైన  రాజకీయ నాయకులను  కోర్టు ముందు హాజరు పరచకపోగా వారి స్థానంలో మరొకరిని తీసుకెళ్లి కోర్టును కూడా అభాసపాలు చేసిన ఘటనలు కూడా కోకొల్లలు ఉన్నాయని  జిల్లావ్యాప్తంగా ప్రజలు గుసగుసలాడుతున్నారు.
*న్యాయస్థానాల మీద నమ్మకం కోల్పోతున్న ప్రజలు*

   కోర్టు కానిస్టేబుల్ ల్లా వసూళ్ల దందాతో  ప్రజలకు న్యాయస్థానాల మీద నమ్మకం పోతున్న పరిస్థితులు ప్రస్తుతం ములుగు,  జిల్లాలో అడుగడుగునా కనబడుతున్న పరిస్థితులు ఉన్నాయని  జరుగుతున్న పరిణామాలను బట్టి అంచనా వేయొచ్చు.ముఖ్యంగా   ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో సుమారు 90% ప్రజలు పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకునే వారే అధిక సంఖ్యలో  ఉన్నారన్నది అందరికీ తెలిసిందే,అటువంటి కూలివాడి జేబును సైతం కుల్లపొడుస్తున్న కోర్ట్ కానిస్టేబుల్ ల వైఖరి మూలన  ఇటు లా అండ్ ఆర్డర్ అటు న్యాయస్థానాలపై ప్రజలకు విశ్వాసం  కోల్పోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఇంకా ఇది చాలదన్నట్టు ఊడ్చే వారికి కూడా ముద్దాయి వద్ద నుండి 100 నుండి 200 రూపాయల వరకు చెల్లించే నాటకం కూడా రక్తి కట్టిస్తున్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ దృష్టి సారించాలి. అడుగడుగునా దోపిడీకి గురవుతున్న ముద్దాయిల పట్ల జిల్లా ఉన్నతాధికారులు కోర్టు కానిస్టేబుల్ పై లోతైన అధ్యయనం చేసి వారు చేసిన పనులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ  ఎవరైతే ముడుపులకు పాల్పడ్డారో, పడుతున్నారో వారిపై కఠినంగా వ్యవహరించి, ప్రజలలో తిరిగి లా అండ్ ఆర్డర్ పై న్యాయస్థానాలపై విశ్వాసాన్ని పెంపొందించే విధంగా  తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతకైనా ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular