TEJANEWSTV TELANGANA: బీబీపేట మండలంలోని
యాడవరం లోని సీతారామ ఆంజనేయ స్వామి నిత్య ధూప దీప నైవేద్య హారతి క్రతువు కైకర్యాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ద్వారా ప్రత్యేక దేవాదాయశాఖ ఎండోమెంట్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ చేతుల మీదుగా ధూప దీప నైవేద్య జీవో అమలు కాపీని దేవాలయ అర్చకులు వేదాంతి శ్రీనివాస శర్మ గారి కి దోమకొండ లో జరిగిన ఓ కార్యక్రమంలో మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారు అందించడం జరిగింది ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ 300 సంవత్సరాల క్రితం నిర్మించబడిన సీతారామ ఆంజనేయస్వామి ధూప దీప నైవేద్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం ఎండోమెంట్ ద్వారా నిధులను కేటాయించి అభివృద్ధి చేయడం కోసం ఎండోమెంట్లో సీతారామాంజనేయ దేవాలయాన్ని చేర్చడం జరిగిందని వారన్నారుఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రావు ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్ మాజీ సర్పంచ్ వెంకటరావు రవి రమేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు
ఎండోమెంట్ లోకి సీతారామస్వామి ఆలయం
RELATED ARTICLES



