TEJANEWSTV TELANGANA
చేగుంట: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వేషన్ను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నేపథ్యంలో చేగుంట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ వార్డుల రిజర్వేషన్ల కోసం డ్రా ప్రక్రియను ఆదివారం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చిన్నరెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని 25 గ్రామ పంచాయతీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ బీసీ, మహిళా వార్డు స్థానాలను పారదర్శకంగా లాటరీ (డ్రా) ద్వారా ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి,, బీజేపీ నాయకులు భూపాల్, చంద్రశేఖర్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు, సండ్రుగు శ్రీకాంత్, నదీమ్,
బి ఆర్ఎస్ పార్టీ నాయకులు అలీ, అన్నం రవి, తదితర వివిధ పార్టీల ముఖ్య నాయ కులు పాల్గొని డ్రా ప్రక్రియను పరిశీలించారు.
డ్రా పద్ధతి ద్వారా వార్డ్ మెంబర్లు రిజర్వేషన్లు ఖరారు
RELATED ARTICLES



