రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని కోర్టు ఆవరణలో డిసెంబర్ 13న జరగనున్న మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా జడ్జి అమ్మన్న రాజా, సీనియర్ సివిల్ జడ్జి శైలజ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కోర్టు కార్యాలయంలో న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్ లో సివిల్ క్రిమినల్ కేసులను రాజీమార్గాల ద్వారా పరిష్కరించేందుకు కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివరామిరెడ్డి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివ ప్రసాద్, న్యాయ వాదులు పాల్గొన్నారు.




