TEJANEWSTV
ఆళ్లగడ్డ,నవంబర్20, రాష్ట్రములో వున్న బ్రాహ్మణ కుటుంబాల సమస్యలు ను ప్రభుత్వ దృష్టికి తీసుకోనిపోయి వాటి పరిష్కారం కోసం కృషి చేయడమే చైతన్య వేదిక లక్ష్యం అని బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులు పీవీయెస్ వి ప్రసాదరావు, సూగురు రఘునాథరావు లు,బ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు కె.పి.వి. సుబ్బారావులు తెలిపారు. ఆళ్లగడ్డ లో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలు లో తెలుగుదేశం గెలుపు కోసం రాష్ట్రంలో కృషి చేసిన నాయకులుతో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర నాయకుడుడొక్కా జగన్నాధం బాబు సిరిపురం శ్రీధర్ శర్మలు 2014నవంబర్ 20వ తేదీన గుంటూరు లో సమావేశం ఏర్పాటు చేసారని నేటికీ పుష్కర కాలం అయిందని నేటి వరకు బ్రాహ్మణ సమస్య లు ధ్యేయం గా తెలుగుదేశం గెలుపే లక్ష్యం గా బ్రాహ్మణ చైతన్య వేదిక పని చేస్తూ వున్నదని అన్నారు. 2014డిసెంబట్ 5వ తేదీ న సమావేశం తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు పై వేదిక సీనియర్ నాయకులు నాగబాబు శ్రీధర్ తదితరులు ముఖ్యమంత్రి ని కలిసి వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు విధి విధానాలు ప్రకటించిన తర్వాత కార్పొరేషన్ ప్రాధాన్యత బ్రాహ్మణ కుటుంబాలు కు ఏ విధంగా ఉపయోగ పడుతుందనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.2019-24 మధ్య కార్పొరేషన్ నిర్వీర్యం అయిందని అయిన రాష్ట్రం లో బ్రాహ్మణ సమస్య లపై పత్రిక పోరాటం చేసిన సంఘం చైతన్య వేదిక అన్నారు. 2024ఎన్నికలు తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం లోకివచ్చిన తర్వాత కార్పొరేషన్ పూర్తి ఏర్పాటు చేసారని ఇప్పుడు బ్రాహ్మణ సమస్యలను పరిష్కరించడానికి కార్పొరేషన్ పూర్తి స్థాయిలో పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమైన సమస్య లు ఉంటే ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకొని పోయే బాధ్యత కార్పొరేషన్ పాలకమండలి దే నని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం లో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని సామజిక పెన్షన్ తల్లికి వందనం స్త్రీ శక్తి పథకం అమలు ప్రశంస నీయం అని అన్నారు. ఆర్థికం గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న కూటమి ప్రభుత్వం కు బ్రాహ్మణులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బ్రాహ్మణ కుటుంబాలకు ప్రస్తుత ప్రభుత్వం లోనే మేలు జరుగుతుందని వారు తెలిపారు.




